: నన్ను మహనీయ అనొద్దు: గవర్నర్
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బాటలోనే రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా నడిచారు. తనను మహనీయ అనొద్దని కేవలం గౌరవనీయ అంటే చాలని గవర్నర్ స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. సరిగ్గా ఇదే నిర్ణయాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లోగడే తీసుకున్నారు. ఇప్పడు నరసింహన్ ఆయనను స్ఫూర్తిగా తీసుకున్నారు.