: పవన్ పొలిటికల్ ఎంట్రీపై జేపీ స్పందన


కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం ఊపందుకున్న సంగతి తెలిసిందే. మార్చి రెండో వారంలో పొలిటికల్ ఎంట్రీపై స్వయంగా ఈ మెగా హీరోనే ప్రకటిస్తారని, సొంత పార్టీ పెడతారని వార్తలొస్తున్నాయి కూడా. ఇదే అంశంపై లోక్ సత్తా పార్టీ జాతీయ అధినేత జయప్రకాశ్ నారాయణ స్పందించారు. మీడియా అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, పవన్ లాంటి వ్యక్తి వస్తామంటే తప్పక స్వాగతిస్తామని చెప్పారు. మంచి వ్యక్తులకు తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు. కాగా, పవన్ కల్యాణ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరే విషయాన్ని కూడా కొట్టిపారేయలేమని రాజకీయ వర్గాలంటున్నాయి.

  • Loading...

More Telugu News