: సుప్రీంకోర్టుకు సుబ్రతోరాయ్ క్షమాపణ


సహారా సంస్థల అధినేత సుబ్రతోరాయ్ సుప్రీంకోర్టుకు ఈ రోజు క్షమాపణ చెప్పారు. ముప్పై ఏడు సంవత్సరాల కాలంలో తనపై ఎలాంటి మరక పడలేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన క్షమాపణను అంగీకరించిన కోర్టు, 'మేము మిమ్మల్ని (సుబ్రతో) గౌరవిస్తాం. కానీ, మీరు మాత్రం మమ్మల్ని (కోర్టు) గౌరవించడం లేదు' అంటూ వ్యాఖ్యానించింది. అయితే, కస్టమర్లకు బకాయిలు చెల్లించేందుకు సహారా ఆస్తులు అమ్మేందుకు అనుమతినివ్వాలని సుబ్రతో చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. తనపై ఉన్న కేసులో సమన్లు పంపినా సుబ్రతో కోర్టుకు హాజరవకపోవడంతో గతవారం సుప్రీం ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ వెంటనే లక్నో పోలీసులు సుబ్రతోను అరెస్టు చేయడంతో నాలుగు రోజుల రిమాండ్ విధించారు. ఈ మధ్యాహ్నం సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టారు.

  • Loading...

More Telugu News