: విజయకాంత్ కు కాంగ్రెస్ గాలం


తమిళనాడులో 10 శాతం ఓటు బ్యాంకు కలిగిన డీఎండీకే పార్టీని తమవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పథకాలు రచిస్తోంది. ఈ మేరకు రకరకాల ఆఫర్లతో ఆ పార్టీ అధినేత, సినీ నటుడు విజయకాంత్ కు గాలం వేయాలనుకుంటోంది. ఇప్పటికే సోనియాగాంధీ సలహాదారుడు అహ్మద్ పటేల్ ఫోన్లో సంప్రదింపులు జరిపారు. ప్రస్తుతం విజయకాంత్ సింగపూర్ లో ఉన్నారు. ఆయన ఈ రోజు చెన్నై రానున్నారు. విజయకాంత్ వచ్చిన వెంటనే ఆయన ఇంటి మెట్లెక్కేందుకు ఇద్దరు కాంగ్రెస్ పెద్దలు కాచుక్కూచున్నారు.

ఇప్పటికే పొత్తుకోసం విజయకాంత్ తో బీజేపీ చర్చలు జరిపింది. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో ఈ రెండు పార్టీలు ఇంతవరకు ఒక అంచనాకు రాలేకపోయాయి. అయితే, విజయకాంత్ డిమాండ్లకు కొన్నింటికి బీజేపీ ఇప్పటికే ఓకే కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో, డీఎండీకేను తమవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ వాయువేగంతో అడుగులు వేస్తోంది. ఒక రాజ్యసభ సీటు కేటాయిస్తామని, మంత్రి పదవులు కూడా ఇస్తామని, ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల ఖర్చును కూడా బరిస్తామంటూ కాంగ్రెస్ ఆఫర్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో, విజయకాంత్ చెన్నై వచ్చిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

  • Loading...

More Telugu News