: ఫేస్ బుక్ పోస్టుకు మూల్యం..యాభై లక్షలు
యువతకు ఫేస్ బుక్ పెద్ద వ్యసనంలా తయారైంది. నిద్రపోయేప్పుడు కూడా ఫేస్ బుక్ పోస్టుల్నే కలవరించేంతగా ఇది అలవాటైపోయింది. స్నేహితుల స్పందన కోసం సంచలన విషయాలపై వ్యాఖ్యానించి లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు నేటి యువత. తాజాగా ఇలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో గలివర్ ప్రిపరేటరీ స్కూలు హెడ్మాస్టర్ గా పని చేసిన ప్యాట్రిక్ స్నే(69) కుమార్తె డానా ఆ పాఠశాలనుద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఫేస్ బుక్ లో పెట్టింది.
వేసవిలో తాను వెళ్లబోయే యూరప్ పర్యటనకు గలివర్ స్కూలు డబ్బు చెల్లిస్తుందంటూ పోస్ట్ పెట్టింది. పనిలో పనిగా కొన్ని బూతులు కూడా ఉపయోగించేసింది. దీనిపై స్కూలు యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పాఠశాల మాజీ ఉద్యోగి, అతని కుమార్తె స్కూలు నిబంధనలు ఉల్లంఘించారని కోర్టును ఆశ్రయించింది. దీంతో సదరు కోర్టు యాభై లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఇప్పుడు తండ్రి, కూతుళ్లు ఫేస్ బుక్ తమ కొంపముంచిందని లబోదిబోమంటున్నారు.