: వారానికి నాలుగు సార్లు చేప కూర తింటే చాలు!
చేప కూరను పాకశాస్త్రంలో చేయి తిరిగిన వారే వండాలి. అప్పుడు దాని రుచి ముందు ఏదైనా బలాదూర్. అలాంటి చేప కూరను వారంలో ఓ నాలుగు సార్లయినా లొట్టలేసుకుంటూ తినండి. మీ గుండె దేన్నైనా తట్టుకుని నిలబడుతుంది. చెడు కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు కారణమైతే.. మంచి కొలెస్ట్రాల్ గుండెను పదిలంగా కాపాడుతుంది. చేప ద్వారా మనకు మంచి కొలెస్ట్రాల్ సమృద్ధిగా సమకూరుతుందని ఈస్ట్రన్ ఫిన్ లాండ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. కొవ్వుతో కూడిన చేపల (సాల్మన్, రెయిన్ బో ట్రౌట్ తదితర రకాలు) ను వారంలో మూడు అంతకంటే ఎక్కువ సార్లు తీసుకునే వారిలో మంచి కొలెస్ట్రాల్ గా పేర్కొనే హెచ్ డీఎల్ కణాలు రక్తంలో ఎక్కువగా ఉంటున్నట్లు వీరి పరిశోధనలో వెల్లడైంది. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి తోడ్పడుతాయని వారు చెబుతున్నారు.