: కేసీఆర్ పై హెచ్చార్సీలో ఫిర్యాదు చేసిన ఆయన అన్న కూతురు


కేసీఆర్ పై ఆయన అన్న కూతురు రమ్య హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ను విమర్శించినందుకు తన ఫంక్షన్ హాల్ పై దాడి చేయడమే కాకుండా... తన భర్తపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను అక్రమంగా పెట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందే టీఆర్ఎస్ బెదిరింపులకు దిగుతోందని విమర్శించారు. కుటుంబ పునాదులనే కాపాడుకోలేని కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణం ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. తన ఫిర్యాదుపై హెచ్చార్సీ జడ్జి సానుకూలంగా స్పందించారని జూన్ రెండో తేదీకి కేసును వాయిదా వేశారని మీడియాతో రమ్య చెప్పారు.

  • Loading...

More Telugu News