: సుబ్రతోరాయ్ ముఖంపై ఇంకు చల్లిన ఓ వ్యక్తి
ఢిల్లీలోని సుప్రీంకోర్టుకు తీసుకువచ్చిన సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతోరాయ్ ముఖంపై ఓ వ్యక్తి నల్లసిరా చల్లాడు. అంతేకాదు, ఆవేశంతో 'సుబ్రతో ఓ దొంగ అని' ఆ వ్యక్తి వ్యాఖ్యానించాడు. వెంటనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి గ్వాలియర్ కు చెందిన మనోజ్ శర్మగా గుర్తించారు. ఇప్పటికే అరెస్టయిన సుబ్రతోను, నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో విచారణకు నిన్న (సోమవారం) ఢిల్లీకి తరలించారు.