: జైరాం రమేష్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ
గుంటూరులో రాజీవ్ గాంధీ భవన్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రి జైరాం రమేష్ ను వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి లాలాపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతకు మందే పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగిడంతో అవాక్కయ్యారు.