: గ్యాస్ ధర పెంపుపై నేడు సుప్రీం విచారణ


దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్ ధరను రెట్టింపు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనున్నది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీపీఐ ఎంపీ గురుదాస్ దాస్ గుప్తా, స్వచ్చంద సంస్థ కామన్ కాజ్ దాఖలు చేసిన రెండు వ్యాజ్యాలు సుప్రీంకోర్టు ముందున్నాయి. కృష్ణా గోదావరి బేసిన్ లో రిలయన్స్ కు ఉన్న చమురు బావుల లైసెన్స్ లను రద్దు చేయాలని దాస్ గుప్తా తన వ్యాజ్యంలో కోర్టును కోరారు. రిలయన్స్ కావాలని ఉత్పత్తిని తగ్గించి ధర పెంచుకునేలా చేసిందని పేర్కొన్నారు. దీనిపై స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు లోగడ కేంద్ర ప్రభుత్వం, రిలయన్స్ లకు నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News