: 'హార్లే'తో ధోనీ షికారు


గాయం కారణంగా ఆసియా కప్ కు దూరమైన టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పుడేం చేస్తున్నాడు? గాయానికి చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడా?... కానే కాదు, ధోనీ మరో పనిలో బిజీగా ఉన్నాడని రాంచీ వాసులంటున్నారు. జాతీయ జట్టులోకి రాకముందే ధోనీకి బైక్ లంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఈ జార్ఖండ్ డైనమైట్ టీమిండియాలోకి వచ్చిన తర్వాత, సంపద పెరగడం, ఇంటిముందు ఖరీదైన బైక్ లు కొలువుదీరడం చకచకా జరిగిపోయాయి. సుజుకి హయబుసా నుంచి హార్లే డేవిడ్సన్ వరకు పేరెన్నిక గన్న అన్ని బ్రాండ్లు ధోనీ గ్యారేజిలో కనిపిస్తాయి.

ఇటీవలే న్యూజిలాండ్ పర్యటన తర్వాత గాయంతో ఆసియా కప్ కు వెళ్ళని ధోనీ, తీరిక సమయాన్ని తన బైక్ ల మెయింటెనెన్స్ కోసం వెచ్చిస్తున్నాడు. ఈ మధ్యనే కోల్ కతా షోరూంలో మరమ్మతులు పూర్తి చేసుకున్న లేటెస్ట్ మోడల్ హార్లే డేవిడ్సన్ బైక్ ఇప్పుడు ధోనీ ప్రియనేస్తం. దానిపై రాంచీ రోడ్ల మీద దూసుకెళుతూ తన బైక్ రైడింగ్ తృష్ణను తీర్చుకుంటున్నాడు. బైక్ రేసింగ్ ల పట్ల విపరీతమైన మక్కువ ఉన్న టీమిండియా కెప్టెన్ తన పేరిట ఓ రేసింగ్ క్లబ్ ను కొనుగోలు చేశాడు. దాని పేర మహి రేసింగ్ క్లబ్. వరల్డ్ సూపర్ బైక్ టోర్నీల్లో ధోనీ జట్టు కూడా పాల్గొంటోంది.

  • Loading...

More Telugu News