: ఎన్డీ తివారీతో కలసి ఉండాలనుకుంటున్నా: రోహిత్ శేఖర్
ఎన్డీ తివారీ సంరక్షణను తాను చూసుకుంటానని ఆయన కొత్త తనయుడు రోహిత్ శేఖర్ అంటున్నాడు. రోహిత్ తన కొడుకేనని రాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ అంగీకరించిన విషయం తెలిసిందే. దీనిపై రోహిత్ స్పందిస్తూ.. 'నేను 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు.. నా తండ్రి ఎన్డీ తివారీ అని అమ్మమ్మ చెప్పింది. ఈ రోజుతో కొత్త జీవితం ప్రారంభమైంది. ఆయన సంరక్షణను నేను చూసుకుంటా. నా తండ్రితో కొంతకాలం కలసి ఉండాలనుకుంటున్నాను' అని రోహిత్ తెలిపాడు.