: ప్రీతి జింటా బీజేపీ వినతిని మన్నిస్తుందా?


సొట్టబుగ్గల సొగసరి ప్రీతిజింటాకు బీజేపీ మరోసారి గాలం వేస్తోంది. ఆ గాలానికి ప్రీతి పడుతుందో లేదో చూడాలి. లోక్ సభ ఎన్నికల్లో ఆకర్షణీయమైన సెలబ్రిటీలను వెతికే పనిలో బీజేపీ నేతలు బిజీగా ఉన్నారు. బీజేపీ సీనియర్ నేత రాజీవ్ ప్రతాప్ రూడీకి నటి ప్రీతిజింటా దూరపు బంధువు. దీంతో ఆయన ప్రీతిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉత్తర ముంబై లోక్ సభ స్థానంలో ప్రియాదత్ పై పోటీకి దింపాలని భావిస్తున్నారు. రాజీవ్ ప్రతాప్ రూడీ 2009లోనూ ప్రీతి జింటాను బీజేపీ నుంచి లోక్ సభ బరిలోకి దింపాలని ప్రయత్నించారు. కానీ, ఆమె అప్పుడు అంగీకరించలేదు. మరి ఈ సారైనా ఓకే అంటుందా? లేదా? చూడాలి.

  • Loading...

More Telugu News