: తెలంగాణ రావడంలో కేసీఆర్ పాత్రేమీ లేదు: షబ్బీర్ అలీ
కాంగ్రెస్ లో విలీనం, పొత్తు లేవని షాకిచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రావడంలో కేసీఆర్ పాత్రేమీ లేదన్నారు. ఆయన తన జీవితంలో ఎప్పుడూ నిజం చెప్పలేదని, ఎప్పుడూ అందరినీ మోసం చేస్తూనే ఉంటారని ఆరోపించారు. అంతకుముందు మాజీమంత్రి జానారెడ్డితో ఆయన నివాసంలో షబ్బీర్ అలీ, శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ ను ఢిల్లీ రావాలని కోరింది అహ్మద్ పటేల్ అని చెప్పారు. ఎంఐఎం కూడా బిల్లుకు సవరణలు ఇచ్చిందని... కానీ, కేసీఆర్ మాత్రం నోరు కూడా మెదపలేదన్నారు. ఉద్యమం చేసిన వారంతా ఒకటి కావాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ను విలీనం కావాలని అడిగామని చెప్పారు. కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్లి సోనియా కాళ్లు ఎందుకు మొక్కారని కేసీఆర్ ను ప్రశ్నించారు.