: హీరో రవితేజ సోదరుడు భరత్ అరెస్ట్
ప్రముఖ సినీ హీరో రవితేజ సోదరుడు భరత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారుజామున హైదరాబాద్ మాదాపూర్ లో మద్యం మత్తులో పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో... భరత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు అరగంట సేపు భరత్ హంగామా సృష్టించాడని పోలీసులు తెలిపారు. రవితేజ సోదరుడు గతంలో కూడా మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ అయ్యాడు.