: తిరుమల శ్రీవారి సమాచారం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు (సోమవారం) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 14 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. కాలి నడకన వచ్చే భక్తులకు 7 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇవాళ సాయంత్రం వరకు 30,343 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.