: జైరాం రమేష్ కు ఏయూ విద్యార్థుల ఝలక్


కేంద్ర మంత్రి జైరాం రమేష్ కు సీమాంధ్రలో చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి. తిరుపతి పర్యటన సందర్భంగా ఆయనను అడ్డుకున్న సీమాంధ్రులు... పటిష్ట భద్రత వున్నా, వందిమాగధుల సమూహం వున్నా మంత్రిని అడ్డగిస్తూనే వున్నారు. విశాఖ పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు విమానాశ్రయం వద్ద అడ్డుకోగా, వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. తరువాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా, అక్కడికి ఆంధ్రాయూనివర్సిటీ విద్యార్థులు దూసుకు వచ్చి 'సమైక్య ద్రోహి గో బ్యాక్' అంటూ నినాదాలు చేసి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

  • Loading...

More Telugu News