: వెంటనే గుర్తిస్తే ఎయిడ్స్ ను తరిమేయొచ్చు!


ఎయిడ్స్ భయంకరమైన వ్యాధులలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షల మంది ఈ వ్యాధి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యాధిని  పూర్తిగా నిర్మూలించి ప్రాణాలు నిలిపే మందులు ఇంతవరకూ రాలేదు.అయితే, ఈ వ్యాధిని సోకిన వెంటనే గుర్తిస్తే పూర్తిగా నివారించడం సాధ్యమేనని ఫ్రాన్స్ పరిశోధకులు చెబుతున్నారు. దీనిపై వారొక పరిశోధన నిర్వహించారు.

 ఈ వ్యాధి సోకిన పది వారాలలోపే 14 మంది రోగులకు చికిత్స ప్రారంభించారు. మూడేళ్ల తర్వాత చూస్తే వారికి ఇక యాంటి రిట్రోవైరల్ మందులు అవసరం లేకపోయింది. కానీ, వ్యాధికారక హెచ్ఐవీ వైరస్ మాత్రం శరీరం నుంచి పూర్తిగా వెళ్లిపోలేదు. భవిష్యత్తులో వైరస్ నూ తరిమేసేందుకు ఈ ఫలితాలు ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News