: కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో పొత్తుల్లేవ్: బొత్స సత్యనారాయణ
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో పొత్తులు ఉండవని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) చీఫ్ బొత్స సత్యనారాయణ చెప్పారు. హైదరాబాదు, గాంధీభవన్లో ఈరోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని ఆయన చెప్పారు. స్థానిక కమిటీల ద్వారానే మున్సిపల్ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు బొత్స తెలిపారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.