: ఢిల్లీ నుంచి షిర్డీ మధ్య ప్రత్యేక రైళ్లు


మార్చి నెలలో షిరిడీ నుంచి ఢిల్లీ వరకు ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ నెలలో వచ్చే హోలీ పండుగ నేపథ్యంలో ఏర్పడే ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఏసీ సూపర్ ఫాస్ట్ రైళ్లు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. ఈ మేరకు మార్చి 7వ తేదీ నుంచి 28 వరకు రోజుకు నాలుగు సార్లు నడపనున్నట్లు చెప్పారు. మార్చి 4 నుంచి బుకింగ్స్ మొదలవుతాయని తెలిపారు.

  • Loading...

More Telugu News