: టీడీపీ 'టీ' కమిటీకి బాబు సన్నాహాలు
తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. ఐదుగురు సభ్యులతో కూడిన తెలంగాణ టీడీపీ కమిటీ వేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. కాగా ఈ కమిటీలో ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రమణ, మండవ, రేవూరి చోటు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కమిటీని ఈ నెల 6న ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.