: అన్నాడీఎంకే లోక్ సభ ఎన్నికల ప్రచారం ప్రారంభం
వచ్చే లోక్ సభ ఎన్నికలకు అన్నాడీఎంకే ప్రచారం ఈ రోజు ప్రారంభమైంది. ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత తమిళనాడులోని కాంచీపురంలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జయలలిత మాట్లాడుతూ, దేశాన్ని కాంగ్రెస్ అవినీతి, కుటుంబ పాలన నుంచి విముక్తి చేయాలని కోరారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసి పలు హామీలను ఇచ్చింది.