: రాష్ట్రం ఇంకా విడిపోలేదు: హైకోర్టు
మనం ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ గందరగోళంగా ఉందని, రెండు రాష్ట్రాలుగా విడిపోయినందున రిజర్వేషన్ల కోటా కూడా మారే అవకాశం ఉందంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా రెండు రాష్ట్రాలుగా విడిపోలేదని, ఇప్పటికి గెజిట్ నోటిఫికేషన్ మాత్రమే వచ్చిందని, ఆపాయింట్ డేను ప్రకటించిన తరువాతే రాష్ట్ర విభజన జరిగినట్టు అని ధర్మాసనం పేర్కొంది. అందువల్ల మనం ఇంకా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నామని ధర్మాసనం స్పష్టం చేసింది.