: పెట్రోలు బంకుల మూసివేతపై గవర్నర్ ఆగ్రహం
పెట్రోలు బంకుల మూసివేతపై గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం వాటిని తెరిపించాలని ఆధికారులను ఆదేశించారు. ప్రజాజీవితానికి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో పెట్రోలు బంకుల్లో వాడుతున్న రెండు కంపెనీల తూనిక యంత్రాల కారణంగా అవకతవకలకు ఆస్కారం ఉందని, వాటిని రిమోట్ తో ఆపరేట్ చేయడం వల్ల ధరను, పరిమాణాన్ని బంకుల యజమానులకు నచ్చిన విధంగా మారుస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని గవర్నర్ కు అధికారులు తెలిపారు. రిమోట్ ల వాడకం చట్టరీత్యా నేరం కనుక కేసులు నమోదు చేశామని అధికారులు వెల్లడించారు. పాస్ వర్డ్ లను కూడా అధికారులకు అందుబాటులో ఉంచడం లేదని, మెషీన్లు కూడా చైనా తయారీవి వాడుతున్నారని గవర్నర్ కు తెలిపారు.