: హైదరాబాదులో సినీ పరిశ్రమకు ఇబ్బందులు ఉండవు: కేటీఆర్
రాష్ట్ర విభజన నేపథ్యంలో సినిమా పరిశ్రమ సీమాంధ్రకు తరలి వెళ్లబోతుందంటూ వస్తున్న వార్తలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. హైదరాబాదులో సినిమా పరిశ్రమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. పరిశ్రమ హైదరాబాదు వదిలి వెళ్లకుండా తాము తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.