: అతను కోటీశ్వరుడు కాదు...‘కోటి’ రూపాయలను కొట్టేశాడు..!
అతణ్ణి అందరూ కోటీశ్వరుడనుకొన్నారు, వ్యాపార పథకమంటూ చెప్పగానే అడిగినంత సొమ్ముని ముట్టజెప్పారు. జనాలను నమ్మించి దర్జాగా కోటి రూపాలయను పోగేసుకున్నాడు. తీరా, పెట్టిన పెట్టుబడిని తిరిగి ఇవ్వమని అడిగినందుకు అతని అనుచరులు దాడి చేసి, బయటకు నెట్టేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘరానా మోసం హైదరాబాదులో బట్టబయలైంది.
హైదరాబాదులో ఉన్నత వర్గాలు నివసించే జూబ్లీహిల్స్ ప్రాంతంలో రవీందర్ రెడ్డి అనే వ్యక్తి బాధితుల నుంచి ‘మనీ స్కీం’ పేరుతో సుమారు కోటి రూపాలయను సేకరించారు. ఆదాయ పథకం నుంచి నగదును చెల్లించాలని బాధితులు అడిగినందుకు రవీందర్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు.