: కాంగ్రెస్ లో చేరనున్న ఎర్రబెల్లి?
తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత అయిన ఎర్రబెల్లి దయాకరరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఆయన తన ముఖ్య అనుచరులతో చర్చిస్తున్నట్టు సమాచారం. అసలేం జరిగిందంటే... తెలుగుదేశం తెలంగాణ కమిటీ వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబుని ఎర్రబెల్లి కోరినట్టు సమాచారం. అయితే, అపాయింటెడ్ డే తర్వాత కమిటీ వేద్దామని చంద్రబాబు సమాధానమిచ్చారట. దీంతో, ఎర్రబెల్లి అలక వహించారని తెలుస్తోంది. తన భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునేందుకు ఎర్రబెల్లి పలువురు నేతలు, అనుచరులతో భేటీ అవుతున్నట్టు సమాచారం.