: భోపాల్ విమానాశ్రయంలో మాధురీదీక్షిత్ కు అవమానం
బాలీవుడ్ సీనియర్ నటి మాధురీ దీక్షిత్ కు ఊహించని అవమానం ఎదురైంది. గులాబ్ గంగ్ చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు నిర్మాత అభినవ్ సిన్హాతో కలసి మాధురీ దీక్షిత్ భోపాల్ వెళ్లారు. ఆదివారం తిరిగి ముంబై వెళ్లేందుకు భోపాల్ విమానాశ్రయానికి వచ్చింది. అక్కడొక అధికారి ఆమెను వీఐపీ లాంజ్ కు తీసుకెళ్లారు. తీరా ఆమె కూర్చున్న తర్వాత.. ఒక్క ఫొటో తీసుకుంటానని కోరాడు. కానీ, తాను అలసిపోయానని కుదరదని మాధురి తేల్చి చెప్పేసింది. దాంతో ఆ అధికారి అగ్గిలం మీద గుగ్గిలంలా మాధురిని వీఐపీ లాంజ్ నుంచి బయటకు వెళ్లిపోవాలని ఆదేశించాడు.