: పాకిస్థాన్ 93/2
ఆసియా కప్ లో ఇండియాతో జరుగుతున్న మ్యాచ్ లో 246 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 93 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ షర్జీల్ ఖాన్ 25 పరుగులకు అశ్విన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అవగా, మరో ఓపెనర్ షహ్జాద్ 42 పరుగులకు మిశ్రా బౌలింగ్ లో అశ్విన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పాకిస్థాన్ మరో 35 ఓవర్లలో 152 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.