: ఏప్రిల్ 7 నుంచి లోక్ సభ ఎన్నికలు?
ఏప్రిల్ 7 లేదా 10 నుంచి లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, లోక్ సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరగనున్నాయని సమాచారం. లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. జూన్ 1తో లోక్ సభ గడువు ముగియనుండటంతో, మే 31లోగా 16వ లోక్ సభ కొలువుదీరనుంది.