: అంబరీష్ ఆరోగ్యం మెరుగుపడింది: సుమలత
నటుడు, రాజకీయవేత్త అంబరీష్ ఆరోగ్యం మెరుగుపడిందని ఆయన సతీమణి సుమలత తెలిపారు. శ్వాశకోస ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న అంబరీష్ ను సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అంబరీష్ కు త్వరలోనే వెంటిలేటర్ తొలగిస్తారని సుమలత తెలిపారు. మరో 15 రోజుల్లో డిశ్చార్జి చేస్తారని చెప్పారు. అంబరీష్ ఆరోగ్యంపై వస్తున్న రూమర్లను మీడియా, ప్రజలు నమ్మరాదని చెప్పారు.