: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటివారైనా ఉపేక్షించం: గవర్నర్


చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని గవర్నర్ నరసింహన్ హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటివారైనా ఉపేక్షించమని వెల్లడించారు. సంక్షేమ పథకాలు యథాప్రకారం కొనసాగుతాయని చెప్పారు. అభివృద్ధి పథకాలు పూర్తి స్థాయిలో అందరికీ అందడమే తమ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రోత్సాహక వాతావరణం ఉంటుందన్నారు. అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి సమస్యలను పరిష్కరించాలని కోరారు. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఉన్నత విద్యలో నాణ్యత పెంచడానికి కృషి చేస్తానని గవర్నర్ తెలిపారు.

  • Loading...

More Telugu News