: పాలనకు ప్రజలంతా సహకరించాలి: గవర్నర్ నరసింహన్


రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించారని గవర్నర్ నరసింహన్ తెలిపారు. తెలుగు వారు వివేకవంతులని... రాష్ట్రపతి పాలనకు ప్రజలంతా సహకరించాలని కోరారు. కాసేపటి క్రితం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనకు ప్రభుత్వ వ్యవహారాలను కట్టబెట్టారని నరసింహన్ చెప్పారు. రాష్ట్రపతి పర్యవేక్షణలో వారి సూచనలు, సలహాల మేరకు రాష్ట్ర పరిపాలన కొనసాగిస్తానని తెలిపారు. అధికారులంతా పాలన సవ్యంగా కొనసాగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ సమన్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూసేందుకు, పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News