: థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై విరుచుకుపడ్డ మోడీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తృతీయ ఫ్రంట్ వల్ల దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. దేశ ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. రాజకీయ అవకాశవాదులు కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశానికి సుస్థిరమైన పరిపాలన అవసరమని అన్నారు. లక్నోలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.