: బంగారు లక్ష్మణ్ పార్థివదేహానికి నివాళి అర్పించిన చంద్రబాబు, వెంకయ్యనాయుడు


బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ భౌతిక కాయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులు దర్శించుకుని నివాళి అర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, ఒక సాధారణ దళిత కుటుంబంలో పుట్టి స్వయం శక్తితో బంగారు లక్ష్మణ్ అత్యున్నత స్థాయికి ఎదిగారని కొనియాడారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, దళిత కుటుంబంలో పుట్టి బీజేపీ జాతీయ అధ్యక్షుడి స్థాయికి ఎదిగిన లక్ష్మణ్ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.

  • Loading...

More Telugu News