: కేసీఆర్ కంటే ముందే మేం పోరాడాం: డీఎస్


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటే ముందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం పోరాటం చేసిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ చెప్పారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ దృఢ సంకల్పం వల్లే తెలంగాణ సాధ్యమైందన్నారు. తెలంగాణ కోసం ఆమె పడిన కష్టం ప్రపంచానికి తెలుసన్నారు. నేతలు ఎవరికివారే వారి నియోజకవర్గాల్లో విజయ యాత్రలు చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ అంటే తమకు గౌరవం ఉందన్నారు. తెలంగాణ విజయం ఏ ఒక్కరి ఘనతో కాదని.. యావత్ తెలంగాణ ప్రజలదని చెప్పారు. త్వరలో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో 117 అసెంబ్లీ సీట్లకు గాను 100 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని డీఎస్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News