: శ్రీవారి సేవలో వైఎస్ జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల కాస్త తోపులాట జరిగింది. ఇతర మతస్తులు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలంటే.. హిందూ మతాన్ని గౌరవిస్తున్నట్లు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, జగన్ ఇది లేకుండానే స్వామి దర్శనం చేసుకోవడం విశేషం.