: ఫ్రీకాల్ నంబరుతో రోజుకు 12 నిమిషాల ఉచిత టాక్ టైం
క్లౌడ్ టెలిఫోన్ ప్రోడక్ట్ ఫ్రీ కాల్ ద్వారా ఉచిత సేవలను అందించే ఫ్రీకాల్.కామ్ సాఫ్ట్ వేర్ ను బెంగళూరు నగరానికి చెందిన ముగ్గురు ఇంజనీరింగ్ పట్టభద్రులు రూపొందించారు. సి.శేఖర్, విజయకుమార్, సందేశ్ లు రూపొందించిన ఈ సాఫ్ట్ వేర్ ను నిన్న బెంగళూరులో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు దొరైస్వామి ఆవిష్కరించారు. ఈ ఉచిత సేవలను 080-49202060 అనే నంబరుకు కాల్ చేసి రోజుకు 12 నిమిషాల పాటు పొందవచ్చు. ఈ 12 నిమిషాలను ఎంతమందికైనా కాల్ చేసి వినియోగించుకోవచ్చు. ముందుగా 080-49202060 కి కాల్ చేస్తే కట్ అయి 10 సెకన్ల నుంచి నిమిషం తర్వాత అదే నంబరు నుంచి మనకు కాల్ వస్తుంది. వెంటనే కాల్ ను స్వీకరించి మనం చేయాల్సిన ఫోన్ నంబరుతో పాటు యాష్ కొట్టి ఓకే చేస్తే సంబంధిత వ్యక్తి ఫోన్ లైన్ లోకి వస్తారు.