: గుజరాత్ అల్లర్లపై తమ వైఖరి మారలేదంటున్న అగ్రరాజ్యం


గుజరాత్ అల్లర్లపై తమ వైఖరిలో ఎలాంటి మార్పులేదని అమెరికా స్పష్టం చేసింది. మానవ హక్కుల నివేదిక నుంచి నరేంద్ర మోడీ పేరు తొలగించినంత మాత్రాన తమ విధానం మారినట్టు భావించరాదని అమెరికా ప్రభుత్వ ప్రతినిధి జెన్ సాకీ తెలిపారు. 2002లో జరిగిన గుజరాత్ మత హింసపై మానవ హక్కుల నివేదికలో స్పష్టంగా పొందుపరిచామని, దానిపై తాజా సమాచారం కూడా ఆ నివేదికలో ఉందని జెన్ సాకీ వెల్లడించారు. 2011, 2012 నివేదికల్లో మోడీ పేరు పేర్కొన్న అమెరికా 2013 నివేదిక నుంచి మోడీ పేరు తొలగించింది.

  • Loading...

More Telugu News