: కరెంటు కష్టాలు... ఇక నుంచి పరిశ్రమలకు ‘పవర్ హాలిడే’
ప్రస్తుతం గృహ వినియోగదారులు కరెంటు కోతలతో అల్లాడుతున్నారు. ఇప్పుడు పరిశ్రమలకూ ‘పవర్ హాలిడే’ని ఏపీఎస్ పీడీసీఎల్ ప్రకటించింది. 3వ తేదీ, సోమవారం నుంచి ఈ పవర్ హాలిడే అమలులోకి వస్తుంది. డిస్కం పరిధిలోని జిల్లాల్లో ఒక్కో రోజు ఒక్కో జిల్లాలోని పరిశ్రమలకు పవర్ కట్ ఉంటుంది. జిల్లాల వారీగా విద్యుత్ కోతల వివరాలిలా ఉన్నాయి.
కడప జిల్లాలో సోమవారం, చిత్తూరు జిల్లాలో మంగళవారం, నెల్లూరు జిల్లాలో బుధవారం, ప్రకాశం జిల్లాలో గురువారం, గుంటూరు జిల్లాలో శుక్రవారం, కృష్ణా జిల్లాలో శనివారం పవర్ హాలిడే ఉంటుందని డిస్కమ్ వర్గాలు తెలిపాయి.