: రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు బీజేపీ వ్యతిరేకం: జైట్లీ
చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఢిల్లీలో ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎఫ్ డీఐలపై బీజేపీ విధానంలో ఏ మార్పులేదని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినా అదే విధానాన్ని అమలు చేస్తామని జైట్లీ తెలిపారు.