: బీజేపీలో చేరనున్న కల్యాణ్ సింగ్


ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ మరోసారి బీజేపీ గూటికి చేరనున్నారు. బీజేపీ నేతగా లబ్దిపొందిన కల్యాణ్ సింగ్ 2009 ఎన్నికలకు ముందు బీజేపీతో విభేదించి, ఆ పార్టీకి బై చెప్పేసి జనక్రాంతి పార్టీని స్థాపించారు. 2013లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో జనక్రాంతి పార్టీని కల్యాణ్ సింగ్ కుమారుడు రణ్ బీర్ సింగ్ విలీనం చేశారు. అయినప్పటికీ కల్యాణ్ సింగ్ బీజేపీలో చేరకుండా దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన బీజేపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో, ఆయన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. బీసీ నేతగా ఉన్న కల్యాణ్ సింగ్ చేరిక యూపీలో బీజేపీ మరింత పటిష్టమయ్యేందుకు దోహదపడుతుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News