: రిక్షావాలాలతో సమావేశమైన రాహుల్ గాంధీ
ఉత్తరప్రదేశ్ లో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు (శనివారం) వారణాశిలో రిక్షా వాలాలు, ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు. అంతకుముందు ఆయన కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించి పరమ శివునికి ప్రత్యేకంగా ‘రుద్రాభిషేకం’ నిర్వహించారు.
ఇవాళ మధ్యాహ్నం రాహుల్ భారీ భ్రదత నడుమ కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ ప్రాంతానికి వెళ్లారు. ఆయన వెంట ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ, కేంద్ర మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ ఉన్నారు. అక్కడి ప్రజలు రాహుల్ కు ఘన స్వాగతం పలికారు. ఆయన దాదాపు 90 నిమిషాల పాటు రిక్షావాలాలు, ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు. వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.