: పంజాబ్ ను గెలిపించిన యువరాజ్


ఆసియాకప్ కు టీమిండియాలో స్థానం దక్కని యువరాజ్ సింగ్ దేశవాళీ టోర్నీలో పరుగులు వెల్లువెత్తిస్తున్నాడు. నేడు విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో యువీ అజేయంగా 96 పరుగులు చేశాడు. ఈ డాషింగ్ ఆల్ రౌండర్ మెరుపులతో పంజాబ్ జట్టు ఆరు వికెట్ల తేడా ఢిల్లీ జట్టును మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 228 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో యువరాజ్ విశ్వరూపం ప్రదర్శించడంతో మరో మూడు ఓవర్లు మిగిలుండగానే పంజాబ్ విజయతీరాలకు చేరింది.

  • Loading...

More Telugu News