: బంగారు లక్ష్మణ్ మృతికి వెంకయ్యనాయుడు సంతాపం
బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ మృతికి ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. విశాఖలో ఓ సభలో ఉన్న ఆయన లక్ష్మణ్ చనిపోయిన వార్త తెలిసిన వెంటనే అక్కడే వేదికపై కొన్ని నిమిషాల పాటు పార్టీ కార్యకర్తలతో మౌనం పాటించారు.