: పెన్ చేతబట్టిన సచిన్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్యాట్ కు విశ్రాంతినిచ్చి పెన్ చేతబట్టాడు. త్వరలోనే తన జీవిత కథను పుస్తకరూపంలో తెచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం స్వయంగా సచినే చెప్పాడు. చెన్నైలో రేనాల్డ్స్ పెన్నుల ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న సచిన్, తన ఆటో బయాగ్రఫీపై పెదవి విప్పాడు. పుస్తకం పని మొదలైందని, వివరాలు ఇప్పుడే చెబితే పుస్తకం ఎవరు చదువుతారని చమత్కరించాడు. సచిన్ తండ్రి రమేశ్ టెండూల్కర్ మరాఠీలో ఎన్నో పుస్తకాలు రాశారు. ఆయన మంచి సాహితీవేత్త కూడా.