: అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో కుప్పకూలిన పాక్
దుబాయ్ లో జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా చేతిలో పాకిస్థాన్ జట్టు కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోతూ 44.3 ఓవర్లకు ఆలౌట్ అయింది. పాక్ జట్టులో అమద్ భట్ చేసిన 37 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. దక్షిణాఫ్రికా బౌలర్లలో బోచ్ 4 వికెట్లు తీశాడు.