: చనిపోయిన మహిళ... రాహుల్ ను ముద్దు పెట్టుకున్న మహిళ ఒకరు కాదట!


గౌహతీ సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ముద్దుపెట్టుకున్న మహిళ, జోరత్ లో మృతి చెందిన మహిళ ఒక్కరు కాదని అసోం పోలీసులు తెలిపారు. జోరత్ జిల్లా ఎస్పీ అమన్ జీత్ కౌర్ మాట్లాడుతూ, మృతి చెందిన మహిళ ఆ రోజు రాహుల్ సభకు హాజరు కాలేదని అన్నారు. భర్తతో తలెత్తిన వివాదం వల్లే ఆమె మృతి చెందిందని, ఈ రెండు ఘటనలకు సంభంధం లేదని ఆమె స్పష్టం చేశారు.

రాహుల్ ను ముద్దుపెట్టుకున్న మహిళ చనిపోయిందని మీడియాలో వార్తలు రావడంతో విచారణ చేపట్టిన పోలీసులు ఇందులో వాస్తవం లేదని తేల్చారు. దీనిపై శూల శోధన చేసే మీడియా ప్రతినిధులు మాత్రం 'ముద్దుపెట్టిన ఆమెతోనే మాట్లాడిస్తే మా అనుమానం తీరిపోయేది కదా' అంటున్నారు.

  • Loading...

More Telugu News