: కేసీఆర్ చెబుతున్నట్టు ఖాళీ కావడానికి టీడీపీ బ్రాందీ సీసా కాదు: చంద్రబాబు


కేసీఆర్ గుండెల్లో నిద్రపోయే పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతుందని కేసీఆర్ చెబుతున్నారని... ఆయన చెబుతున్నట్టు ఖాళీ అవడానికి టీడీపీ బ్రాందీ సీసా కాదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే సీఎంలాంటి ముఖ్య పదవులన్నీ బీసీలకు ఇస్తామని చెప్పారు. ఈ రోజు హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం కాంగ్రెస్ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్ కు ఎప్పుడు అధికారం ఇచ్చినా... ఒక్క ఐదేళ్లపాటు కూడా స్థిరమైన పాలన అందించలేకపోయిందని విమర్శించారు.

  • Loading...

More Telugu News