: క్రికెట్ రారాజు విగ్రహావిష్కరణ
వివియన్ రిచర్డ్స్... ఈ పేరు చెబితే 70, 80వ దశకాల్లో బౌలర్ల గుండెల్లో రైళ్ళు పరిగెత్తేవి. బంతి పాలిట యమరాజులా ఈ కరీబియన్ వీరుడు విరుచుకుపడుతుంటే ప్రత్యర్థి జట్లు చేష్టలుడిగి నిల్చుండేవి. తన శకంలో మరెవ్వరికీ అందనంత స్థాయిలో నిలిచిన కింగ్ రిచర్డ్స్ ఇప్పుడు మరో అపురూప గౌరవాన్నందుకున్నాడు. సొంతగడ్డ సెయింట్ జాన్స్ లో రిచర్డ్స్ విగ్రహం ఆవిష్కరించారు. అదీ తన పేరిటే ఉన్న సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వెలుపల ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంటిగ్వా ప్రధానమంత్రి బాల్డ్విన్ స్పెన్సర్ మాట్లాడుతూ, మహోన్నత క్రికెటర్ విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం తనకు దక్కిన అపురూప గౌరవమన్నాడు.